పల్లె ప్రకృతిలో బర్ల మంద
TeluguStop.com
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ(Yellareddypet )ల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం(Palleprakruthi Vanam.
) వికృతంగా మారిన సంఘటన గత కొన్ని మాసాలుగా కొనసాగుతుంది వివరాలోకి వెళ్తే.
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పల్లె ప్రకృతి వనం సుందరీ కరణ పనులు జరిగాయి , నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఇప్పటివరకు పల్లె ప్రకృతి వనాన్ని ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు ప్రవేశ గేటు విరిగిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ తీరును గమనిస్తే పల్లె ప్రకృతికి అన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఓపెన్ జిమ్ పరికరాలు విరిగాయి అంతేకాకుండా సమీపంలో ఉన్న గిద్ద చెరువు బర్ల మంద పల్లె ప్రకృతి వనంలోకి వస్తున్నాయి గేదెలు , బర్లు రావడంతో పేడ వేస్తున్నాయి వేయడం వలన పల్లె ప్రకృతికి వచ్చే పర్యటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు , ఉదయం సాయంత్రం వేళలో వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు.
అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్త పడాలని అధికారులు స్పందించి పల్లె ప్రకృతి ప్రవేశద్వారాన్ని , ఓపెన్ జిమ్ పరికరాలను మరమ్మత్తులు చెయ్యాలని ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ప్రధాని మోడీ తర్వాత టాప్ 10 లో నిలిచిన ఎన్టీఆర్… ఏం జరిగిందంటే?