తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం.. అభివృద్ధిపై ఫోకస్ పెడదాం - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ‘‘ఎన్నికలైపోయినయ్.ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దాం.రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివ్రుద్ధిపైనే ఫోకస్ చేద్దాం.కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం.గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం.ఈ విషయం కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత నేను తీసుకునేందుకు సిద్ధం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

 Lets Focus On Development Union Home Minister Bandi Sanjay Kumar, Telangana Deve-TeluguStop.com

సోమవారం సిరిసిల్లకు విచ్చేసిన బండి సంజయ్ కు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పట్టణంలోని మున్నూరుకాపు సంఘం కళ్యాణ మండపానికి విచ్చేసి రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కళ్యాణ మండపం ఆవరణలో మొక్క నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ ను సంఘం నాయకులు సన్మానించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కుల సంఘం ఆఫీస్ ను నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతోంది.

కానీ కుల సంఘాల తరపున కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతోంది.ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ లాడ్స్ నిధులిస్తున్నా.

ఏ కుల సంఘమైనా సరే… ఆ కులంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడు మాత్రమే కుల సంఘాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.నేను మీలో ఒకడిని, మున్నూరు కాపు సంఘం చేపట్టే ప్రజోపయోగ పనులకు తనవంతు పూర్తి సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నా.

మున్నూరుకాపు సంఘం పెద్దల ప్రతిపాదన మేరకు కంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తానన్నాడు.

రెండోసారి ఎంపీగా అత్యదిక మెజారిటీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉంది.

రెండోసారి గెలవడంవల్లే మోదీ కేబినెట్ లో చోటు దక్కింది.జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా.

కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతోపాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.ఆయా రంగాల నుండి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా.

కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని .కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత నేను తీసుకుంటానన్నారు.‘‘ఎన్నికలైపోయినయ్.

ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దాం.రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధి పైనే ఫోకస్ చేద్దాం.

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం.గ్రామాలు, పట్టణాలు అభివ్రుద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం.

ఈ విషయం కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత నేను తీసుకునేందుకు సిద్ధం.అందరూ సహకరించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube