తెల్ల జుట్టును నల్లగా మార్చే సొరకాయ.. ఇంతకీ ఎలా వాడాలంటే?

సొరకాయ( Bottle gourd ).మన ఆరోగ్యానికి ఎంతో మీరు చేసే కూరగాయల్లో ఇది కూడా ఒకటి.

 Bottle Gourd Turns White Hair To Black! Bottle Gourd, White Hair, Black Hair, Ha-TeluguStop.com

వివిధ రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్ సొరకాయలో పుష్కలంగా ఉంటాయి.రక్త పోటును అదుపు చేయడానికి, అధిక బరువు నుంచి బయటపడడానికి, శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి సొరకాయ చాలా బాగా సహాయపడుతుంది.

అయితే తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చే సామర్థ్యం కూడా సొరకాయ కు ఉందన్న విషయం మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.సొరకాయ మెలనిన్ ఉత్పత్తిని పెంచి జుట్టును నల్లగా మార్చగలదు.ఒత్తైన పొడవాటి కురులను మీ సొంతం చేయగలదు.మరి ఇంతకీ సొరకాయను కురులకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక సొరకాయను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను కాటన్ క్లాత్ పై వేసి వారం రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె ( coconut oil )పోసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఎండిన సొరకాయ ముక్కలు వేసి చిన్న మంటపై దాదాపు 15 నిమిషాలకు పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్‌ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Black, Bottlegourd, Care, Care Tips, Oil, Healthy, White-Telugu Health

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారాక ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ సొరకాయ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకుని మరుసటి రోజు లేదా ఐదారు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Black, Bottlegourd, Care, Care Tips, Oil, Healthy, White-Telugu Health

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ సొరకాయ నూనెను వాడితే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.అలాగే ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ఇక ఈ సొరకాయ ఆయిల్ ను వాడటం తో పాటు వారానికి రెండు సార్లు సొరకాయ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి.సొరకాయ జ్యూస్ వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందించడంతో పాటు తెల్ల జుట్టుకు సైతం చెక్ పెడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube