ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2(Pushpa 2) .ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

 Pushpa 2 Movie Pre Pone On December 5th, Pushpa 2, Allu Arjun, Release Date, Dec-TeluguStop.com

ఈ సినిమా విడుదలకు సమయం కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పుష్ప సినిమా నేషనల్ ప్రెస్ మీట్ నేడు నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఇండియాలో ఏ ఏ రాష్ట్రాలలో అయితే ఈ సినిమా విడుదల అవుతుందో ఆ రాష్ట్రానికి చెందిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర బృందం కూడా పాల్గొన్నారు.

Telugu Allu Arjun, August, December, Pushpa-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా పుష్ప(Pushpa) సినిమా విడుదల గురించి పలు విషయాలను వెల్లడించారు.అయితే ఈ సినిమా అనుకున్న సమయాన్ని కంటే ఒకరోజు ముందుగానే విడుదల కాబోతుందని తెలియజేశారు.ఈ సినిమా డిసెంబర్ 6న కాకుండా 5వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఈ క్రమంలోనే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Arjun, August, December, Pushpa-Movie

నిజానికి ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో వాయిదా పడింది.ఇక ఆగస్టు 15వ(August 15th) తేదీ ఈ సినిమా తప్పనిసరిగా విడుదలవుతుందని మేకర్స్ వెల్లడించారు.అప్పటికి ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6 వ తేదీన విడుదల కాబోతుందని ప్రకటించారు.అయితే అనుకున్న సమయానికంటే ఓ రోజు ముందుగానే ఈ సినిమా రాబోతుందని తాజాగా తెలిపారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే.

సునీల్ పహాద్ ఫాజిల్, అనసూయ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube