ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) కు బెయిల్ మంజూరు అయింది.తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పట్ల ఈయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అలాగే తనపై అత్యాచారం కూడా చేశారు అంటూ బాధ్యత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు ఈయనని అరెస్టు చేసి తనపై పోక్సో చట్టం అలాగే అత్యాచారం కేసు నమోదు అయ్యింది.ఇలా ఇన్ని రోజులు పాటు ఈయన రిమాండ్ లోనే ఉన్నారు.
గతంలో అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు ఈయనకు కోర్టు బెయిల్( Bail ) మంజూరు చేసింది కానీ చివరి నిమిషంలో బెయిల్ రద్దు చేసింది.
ఈయనకు నేషనల్ అవార్డు( National Award ) వచ్చిన విషయం మనకు తెలిసిందే.నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత కొద్ది రోజులకి ఈయన ఈ వివాదంలో చిక్కుకొని జైలుకు వెళ్లారు.ఇక నేషనల్ అవార్డు అందుకోవడం కోసం కోర్టు ఈయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు.
ఈయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.తద్వారా ఈయన బెయిల్ క్యాన్సిల్ అవడంతో ఈయన రిమాండ్ లోనే ఉన్నారు.
తాజాగా ఈయన బెయిల్ కోసం మరోసారి పిటిషన్ వేయగా ఆ పిటిషన్ విచారించిన కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈయన విడుదల అవుతున్న తరుణంలో కోర్టు కొన్ని షరుతులను కూడా విధించింది.కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న జానీ మాస్టర్ ఒక్కసారిగా ఇలా జైలు పాలు కావడంతో ఈ ప్రభావం తన కెరియర్ పై పూర్తిస్థాయిలో దెబ్బ కొట్టిందని చెప్పాలి.పుష్ప సినిమాలో పలు పాటలకు ఈయన కొరియోగ్రఫీ చేసే అవకాశం అందుకున్నారు.
అయితే ఈయన జైలు పాలు కావడంతో ఈయన స్థానంలో మరొకరిని తీసుకున్నారు అంటూ ఇటీవల పుష్ప మేకర్స్ కూడా ఈ విషయం గురించి వెల్లడించారు.