1 నుండి.19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేసిన ఆరోగ్య సిబ్బంది పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో మండల వైద్యాధికారి స్రవంతి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు, ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక, ఎంపీడీవో సత్యనారాయణ, మండల వైద్యాధికారి స్రవంతి మాట్లాడుతూ ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులి పురుగు నివారణ మాత్రలు వేసి పురుగులను పూర్తిగా నిర్మూలించడానికి ఆల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రాలను ఆరోగ్య సిబ్బంది వేశారు, ఆల్బెండజోల్ మాత్రలు ఎటువంటి హాని చేయదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం వల్ల కడుపులో పెరిగే నట్టలను పూర్తిగా నివారించే అవకాశం ఉంటుందన్నారు, ఈ మాత్రాల వల్ల పిల్లల్లో వచ్చే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత బరువు తగ్గడం, కడుపునొప్పి ఇలాంటి వాటిని నివారించవచ్చని మండల వైద్యాధికారి స్రవంతి అన్నారు, ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ప్రతి పిల్లలకు మాత్రలు వేసేలా అటు అధికారులు ఇటు తల్లిదండ్రులు బాధ్యత తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలని సూచించారు, పిల్లలు ఆరుబయట వట్టికాలతో ఆడుకోవడం, మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల నులిపురుగులు తయారవుతాయని అన్నారు, పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆల్బెండజోల్ మాత్ర ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలంలోని ప్రతి గ్రామంలో 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఏపించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు పందిర్ల నాగరాణి, ఎనగందుల అనసూయ, సూపర్వైజర్ లూత్ మేరీ, ఏఎన్ఎంలు భూ లక్ష్మి, ప్రవీణ కుమారి, అమృతవల్లి, సుమలత, రూతమ్మ, శారద, పలువురు ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




Latest Rajanna Sircilla News