రాజన్న సిరిసిల్ల జిల్లా :పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, యోగా సాధన సమితి ఆధ్వర్యంలో సిరిసిల్ల లోని ఇందిరాపార్క్ లో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీరజ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.







