ఓజీ సినిమా పోస్ట్ పోన్.. ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా వాయిదా పడ్డట్టేనా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Lucky Bhaskar Release Date Creates Doubts On Pawan Kalyan Og Details, Lucky Bhas-TeluguStop.com

అయితే పవన్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.అందులో ఓజీ సినిమా( OG Movie ) కూడా ఒకటి.

ఈ సినిమా ఇంకా కాస్త షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమా విడుదల తేదిని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే పవన్ అభిమానులు ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అవుతుంది అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా ఇంతలో వారికి ఒక ఊహించని షాక్ ఎదురైంది.అదేమిటంటే అదే డేట్ కి దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) హీరోగా నటించిన లక్కీ భాస్కర్( Lucky Baskhar ) సినిమా విడుదల కానున్నట్లు తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.దీంతో కొత్త కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా అందుకే దుల్కర్ సినిమా ఆ డేట్ కి విడుదల అవుతుందా? అని ఆందోళన పడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమాణులు.

మామూలుగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు పోటీ ఇవ్వడం అన్నది తక్కువ.అలాంటిది ఏకంగా పవన్ కళ్యాణ్ కి దుల్కర్ సల్మాన్ పోటీగా వస్తున్నాడు అంటే తప్పకుండా ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయంపై మరింత సమాచారం తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందిచే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube