ఓజీ సినిమా పోస్ట్ పోన్.. ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా వాయిదా పడ్డట్టేనా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే పవన్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.

అందులో ఓజీ సినిమా( OG Movie ) కూడా ఒకటి.ఈ సినిమా ఇంకా కాస్త షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదిని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

"""/" / అయితే పవన్ అభిమానులు ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అవుతుంది అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా ఇంతలో వారికి ఒక ఊహించని షాక్ ఎదురైంది.

అదేమిటంటే అదే డేట్ కి దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) హీరోగా నటించిన లక్కీ భాస్కర్( Lucky Baskhar ) సినిమా విడుదల కానున్నట్లు తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

దీంతో కొత్త కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా అందుకే దుల్కర్ సినిమా ఆ డేట్ కి విడుదల అవుతుందా? అని ఆందోళన పడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమాణులు.

"""/" / మామూలుగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు పోటీ ఇవ్వడం అన్నది తక్కువ.

అలాంటిది ఏకంగా పవన్ కళ్యాణ్ కి దుల్కర్ సల్మాన్ పోటీగా వస్తున్నాడు అంటే తప్పకుండా ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ విషయంపై మరింత సమాచారం తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందిచే వరకు వేచి చూడాల్సిందే మరి.

దర్శకుడు హరీష్ శంకర్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఉస్తాద్ తో లక్ష్యాన్ని సాధిస్తాడా?