ఉప్పు(సోడియం క్లోరైడ్).మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఖనిజం.
మన శరీరం యొక్క పని తీరులో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది.ఉప్పు శరీరం నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
కణాలు, కణజాలాలు హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది.అలాగే కండరాల సక్రమ పనితీరుకు, శరీరం యొక్క యాసిడ్-బేస్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి, కణాలలో ద్రవాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఉప్పు ఎంతో అవసరం.
అలా అని ఉప్పును ఎక్కువ తీసుకుంటే మాత్రం భయకరమైన సమస్యలు తలెత్తుతాయి.అవసరానికి మించి ఉప్పును తీసుకోవడం చాలా ప్రమాదకరం.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు( High Blood Pressure) సమస్య తలెత్తుతాయి.ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.అలాగే ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పని తీరు దెబ్బ తింటుంది.మూత్రపిండాల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.కొంతరు తరచూ తలనొప్పితో బాధపడుతున్నారు.అందుకు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణమని గుర్తుపెట్టుకోండి.
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పును వినియోగించడం వల్ల డీహైడ్రేషన్ మరియు రక్త ప్రవాహంలో మార్పులు తలెత్తుతాయి.ఇవి కొంత మందిలో తలనొప్పి లేదా మైగ్రేన్( Migraine )లను ప్రేరేపిస్తాయి.అలాగే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం మరియు పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బ తింటుంది.అంతేకాదు ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల తరచూ విపరీతమైన దాహంతో ఇబ్బంది పడతారు.
ఒంట్లో నీరు నిలుపుదల ఏర్పడుతుంది.ఇది చేతులు, పాదాలు, చీలమండలు, పొత్తికడుపు వాపుకు దారితీస్తుంది.
కాబట్టి కష్టమైనా సరే ఉప్పును ఎక్కువ తీసుకునే అలవాటును మానుకోండి.ప్రాసెస్ చేయబడిన లేదా ప్యాక్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, సాల్టీ స్నాక్స్ మరియు సోడియం ఎక్కువగా ఉండే రెస్టారెంట్ మీల్స్‌ను కంప్లీట్ గా నివారించండి.
అలాగే శరీరం నుండి అదనపు సోడియంను ఫ్లష్ చేయడం వాటర్ ఎక్కువగా తీసుకోండి.