వైసీపీ మ్యానిఫెస్టో -2024.. వచ్చే ఐదేళ్లు సుపరిపాలన

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) విడుదల చేసింది.

 Ycp Manifesto 2024 Good Governance For The Next Five Years Details, Ap State, Ja-TeluguStop.com

ఈ మేరకు ‘నవరత్నాలు ప్లస్’( Navarathnalu Plus ) పేరిట మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్( CM Jagan ) రెండు పేజీల మ్యానిఫెస్టోను ప్రకటించారు.విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక భద్రత, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, పోర్టుల నిర్మాణంతో పాటు వాలంటీర్ల వ్యవస్థ వంటి పలు అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్లు సీఎం జగన్ తెలిపారు.

గత మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేశామన్న సీఎం జగన్ నవరత్నాలను యథావిథిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఇందులో భాగంగా అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి రూ.17 వేలు అందిస్తామని తెలిపారు.తల్లులకు ఈ పథకం కింద రూ.15 వేలు ఇస్తామన్న సీఎం జగన్ మిగతా రూ.2000 స్కూల్స్ కోసమని తెలిపారు.మహిళల కోసం.వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామన్నారు.అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు కొనసాగిస్తామన్న వైఎస్ఆర్ చేయూత రూ.75 వేల నుంచి రూ.లక్షా 50 వేలకు పెంచుతామన్నారు.వైఎస్ఆర్ ఆసరా( YSR Aasara ) పథకం ద్వారా రూ.3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ కార్యక్రమం వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తామని తెలిపారు.

Telugu Ammavodi, Ap, Asara, Jagan Assurance, Navarathnalu, Ycp Governance, Ycp M

వైఎస్ఆర్ కాపు నేస్తంను నాలుగు దఫాల్లో రూ.లక్షా 20 వేలకు పెంచుతామని సీఎం జగన్ మ్యానిఫెస్టోలో తెలిపారు.వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం( YSR EBC Nestham ) నాలుగు దఫాల్లో.రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేలకు పెంపుతో పాటు పేదలకు ఆసరా పెన్షన్ రూ.3,500 కు పెంచుతామన్నారు.అలాగే రైతుల కోసం మ్యానిఫెస్టోలో కీలక అంశాలను చేర్చారు.రైతు భరోసా( Rythu Bharosa ) నగదును రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచారు.అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు.పేదలకు సొంతిటి కలను సాకారం చేస్తామన్న సీఎం జగన్ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతాయని తెలిపారు.

వైఎస్ఆర్ వాహన మిత్ర, లా నేస్తం వంటి పథకాలు యథావిథిగా కొనసాగుతాయని చెప్పారు.

Telugu Ammavodi, Ap, Asara, Jagan Assurance, Navarathnalu, Ycp Governance, Ycp M

ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పరిపాలన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.మూడు రాజధానుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు.వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును( Polavaram Project ) పూర్తి చేస్తామని చెప్పారు.

నిర్మాణంలో ఉన్న నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.భూముల రీసర్వే చేపడతామని, భోగాపురం ఎయిర్ పోర్టు కంప్లీట్ చేస్తామని పేర్కొన్నారు.

విద్యారంగంలో ఇప్పటికే కీలక సంస్కరణలు తెచ్చామన్న సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు చేస్తామని తెలిపారు.అదేవిధంగా ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్ లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో సర్టిఫికేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Telugu Ammavodi, Ap, Asara, Jagan Assurance, Navarathnalu, Ycp Governance, Ycp M

దాదాపు 58 నెలల పాలనలో నవరత్నాల పథకాల ద్వారా పేదలకు మంచి చేశామని సీఎం జగన్ తెలిపారు.రూ.2 లక్షల 70 వేల కోట్లను డీబీటీ రూపంలో లబ్దిదారులకు అందించామన్నారు.పాదయాత్ర సమయంలో చూసిన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మ్యానిఫెస్టోలో పెట్టామన్న ఆయన ఆ దిశగానే తమ పాలన కొనసాగిందని పేర్కొన్నారు.

కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమాన్ని ఆపలేదని చెప్పారు.ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రతి పథకాన్ని డైరెక్ట్ గా ప్రజలకు చేర్చామన్నారు.ఈ తరహాలోనే వచ్చే ఐదేళ్లు కూడా సుపరిపాలన అందిస్తామని సీఎం జగన్ తెలిపారు.అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube