ప్రముఖ టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత( Madhavi Latha ) ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.ఏపీలో ప్రస్తుతం పోటాపోటీ ఉందని ఆమె అన్నారు.
తెలంగాణలో సైతం ఎలక్షన్స్ ఉన్నాయని మరిచిపోయి ప్రస్తుతం అందరూ ఏపీ వైపు ఫోకస్ పెట్టారని ఆమె వెల్లడించారు.మూడు పార్టీలు ఒకవైపు జగన్( Jagan ) ఒకవైపు ఉన్నారని మాధవీలత పేర్కొన్నారు.
వాళ్లు మా జగనన్న సింహం అని ఫీలవుతారని వైసీపీ దగ్గర డబ్బు ఉందని ఎక్కువ ఉచిత పథకాలు ఉన్నాయని జనాల మూస ధోరణి కూడా ఉందని ఆమె తెలిపారు.ఏపీ సీఎం( AP CM ) విషయంలో ఫ్యాన్స్ ను వదిలేస్తే మిగిలిన వాళ్లు మాత్రం చాలా ఫ్రస్టేటెడ్ గా ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు.
మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అది కూడా చేయలేదని మాధవీలత పేర్కొన్నారు.ప్రభుత్వమే లోకల్ బ్రాండ్స్ ద్వారా మద్యం( Alcohol ) అమ్ముతోందని ఆమె చెప్పుకొచ్చారు.
భారతదేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ అన్నీ ఏపీలో ఉన్నాయని మాధవీలత కామెంట్లు చేశారు.అవి తాగేసి మా లివర్లు పాడైపోయాయని చెబుతున్నారని ఆమె అన్నారు.తాగుబోతులను మందు తాగొద్దని చెప్పినా సాయంత్రానికి తాగుతారని మాధవీలత అన్నారు.టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.రిషికొండలో కొండను మొత్తం తవ్వి గ్రీన్ మ్యాట్ వేశారని మాధవీలత అన్నారు.
వాలంటీర్లు ఈసీ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు.కొంతమంది నేతలు ఎప్పుడూ ప్రతిపక్ష నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు.ఏపీ లీడర్లు సమస్యల మీద మట్లాడినట్లు చూడలేదని మాధవీలత వెల్లడించారు.
జగన్ ను ఉత్త పుణ్యానికే జైలులో పెట్టారా అని ఆమె ప్రశ్నించారు.ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని ఆమె పేర్కొన్నారు.