విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని( YCP MP Kesineni nani ) ఎన్డీఏ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పై టీడీపీ.
బీజేపీ జనసేన కూటమి కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.మొన్నటిదాకా ఈ నియోజకవర్గాన్ని బీసీలకు, జనసేనకు ఇచ్చామని తెలుగుదేశం చెప్పింది.
కానీ ఈ నియోజకవర్గ టికెట్ బీసీ అభ్యర్థికి( BC Candidae ) కాకుండా బీజేపీ తరపున ధనికుడైన ఓ వ్యాపారవేత్తకు ఇవ్వబోతున్నారని ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని పరోక్షంగా సుజనా చౌదరి గురించి వ్యాఖ్యానించారు.
చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరిగే ఆ బిజినెస్ మాన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలరు.అని కీలక వ్యాఖ్యలు చేశారు.పేదలు ఉండే నియోజకవర్గాలలో డబ్బున్నవారికి తెలుగుదేశం టికెట్ ఇస్తుందని కేశినేని నాని మండిపడ్డారు.
తమ పార్టీ అధినేత సీఎం జగన్ చెబుతున్నట్టు ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయి.ఎన్నికలలో గెలిచే సత్తాలేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) కుట్రలు కూతంత్రాలకు తెరతీస్తున్నారు అని విమర్శించారు.
విజయవాడ పశ్చిమ స్థానం ఎప్పటికీ బీసీలు, మైనారిటీల దేనని అన్నారు.అంతేకాదు గతంలో తన కూతురు విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తానంటే వద్దని తానే బహిరంగంగా చెప్పినట్లు కేశినేని నాని స్పష్టం చేశారు.