త్వరలో ఎన్నికలు జరగనుండగా కావాలనే వైసీపీపై ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.విశాఖ డ్రగ్స్( Visakha drugs ) పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్న సజ్జల వైసీపీపై ( YCP )సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.అలాగే డ్రగ్స్ వ్యవహారంలో బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
వారు తప్పు చేసి తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.అలాగే డ్రగ్స్ వ్యవహారంపై అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.