కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై( Rahul Gandhi ) బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది.రాహుల్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.
కొద్ది రోజుల క్రితం ముంబైలో “భారత్ జోడో న్యాయ్ యాత్ర” ( Bharat Jodo Nyay Yatra ) ముగిసింది.ఆ సమయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.
హిందుత్వంలో శక్తి అనే పదం ఉంటుంది.అది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న.
మనం దాంతోనే పోరాటం చేస్తున్నాం.దాని ఆత్మ ఈవీఎం, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్స్ లలో నిక్షిప్తమై ఉంది.
అంటూ రాహుల్ ప్రసంగం చేశారు.దీనిపైనే బీజేపీ ఫిర్యాదు చేయడం జరిగింది.
దేశంలో ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో నేతల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా డైలాగ్ వార్ సాగుతోంది.రాహుల్ గాంధీ గతంలో కంటే ఈసారి.తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తున్నారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గ్రాఫ్ కూడా గతం కంటే పెరిగింది.ఇదిలా ఉంటే సరిగ్గా రెండు వారాల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయడం జరిగింది.
ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ( BJP ) ఫిర్యాదు చేసింది.గత ఏడాది నవంబర్ 24న రాజస్థాన్ లో జరిగిన ర్యాలీలో… ప్రధాని మోదీపై నెగిటివ్ కామెంట్స్ చేశారు.
ఆ సమయంలో.మాట తీరు సరిగ్గా ఉండాలని సూచించడం జరిగింది.
కాగా ఇప్పుడు మరోసారి బీజేపీ… రాహుల్ గాంధీ పై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.