మెగా డాటర్ నిహారిక( Mega daughter Niharika ) తాజాగా పెళ్లి, పిల్లల గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నిహారిక అలా కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే చైతన్య జొన్నలగడ్డ ( Chaitanya jonnalagadda )సోషల్ మీడియా వేదికగా సైలెన్స్ అంటూ ఒక పోస్ట్ ను పంచుకున్నారు.
గతంలో నిహారిక ఇంటర్వ్యూ గురించి చైతన్య కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో చైతన్య ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు.
అయితే నిహారిక నుంచి ఏవైనా కామెంట్లు వస్తే మాత్రం కౌంటర్ ఇచ్చే విషయంలో చైతన్య ముందువరసలో ఉంటారు.“సువిశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం.నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం.చలికాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం.మీ హృదయాన్ని బద్దలుగొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం.జీవితం మిమ్మల్ని ముంచెత్తిన సమయంలో మీ ఆలోచనలతో మీరు కోరుకునే నిశ్శబ్దం అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇలా సైలెన్స్ అనేది మీ ప్రాణ శక్తిని ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తుందని చైతన్య చెప్పుకొచ్చారు.ఇది మౌనంతో దేవుడు కలిపే మాధ్యమం అంటూ చైతన్య కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.దైవ చింతనలో మునిగిపోయి చైతన్య ఈ విధంగా కామెంట్లు చేస్తున్నాడని కొంతమంది అభిప్రాయపడుతుండగా మరి కొందరు మాత్రం నిహారిక సైలెంట్ గా ఉండాలంటూ చైతన్య కౌంటర్ ఇచ్చాడని మరి కొందరు చెబుతున్నారు.
చైతన్య జొన్నలగడ్డ రాబోయే రోజుల్లో మీడియా ముందుకు వచ్చి విడాకులకు( divorce ) సంబంధించి పూర్తిస్థాయిలో కారణాలను వెల్లడిస్తారేమో చూడాలి.నిహారిక వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న వివాదాల వల్లే నిహారిక చైతన్య మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తోంది.విడాకులు తీసుకున్నా నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
నిహారిక ప్రస్తుతం కెరీర్ పరంగా తెగ బిజీగా ఉండటం గమనార్హం.