Shani Dosh : జాతకంలో శని దోషమా.. అనుగ్రహం కోసం శనివారం రోజు ఈ పరిహారం..?

నవగ్రహాలలో శనీశ్వరుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.సూర్యుడి తనయుడైన శనీశ్వరుడు కర్మ ప్రధాత.

 Is Shani Dosha In Horoscope Saturday Is The Remedy For Grace-TeluguStop.com

అలాగే మానవులు చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు.కాబట్టి శని దేవుడిని న్యాయాధిపతి అని కూడా పిలుస్తారు.

గ్రహాలలో అతి నెమ్మదిగా కదిలే గ్రహం కూడా శనీశ్వరుడే.ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగుపెట్టడానికి శనీశ్వరుడికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది.

కాబట్టి శనీశ్వరుడిని( Lord shani ) మందగమనుడు అని కూడా అంటారు.అయితే జ్యోతిష్య శాస్త్రం పై నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు.

Telugu Devotional, Grace, Lord Hanuman, Lord Shani, Shani Dosh, Shani Dosha, Sri

చాలామంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతూ ఉంటారు.అయితే శని మంచి పనులు చేసే వారి పై అనుగ్రహం, చెడు పనులు చేసే వారికి కష్టాలను ఇస్తాడని పెద్దవారు చెబుతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజున శనీశ్వరుడి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.శనీశ్వరుడికి స్నేహితుడు హనుమంతుడు.కాబట్టి హనుమంతుడి( Lord hanuman )ని పూజించిన భక్తుల పై శనీశ్వరుడి ప్రభావం ఉండదు.శుభ దృష్టిని కలిగి ఉంటాడు.

అంతేకాకుండా శనివారం రోజు కాకులకు, చీమలకు, కుక్కలకు ఆహారం అందించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

Telugu Devotional, Grace, Lord Hanuman, Lord Shani, Shani Dosh, Shani Dosha, Sri

ఇలా చేస్తే జాతకంలో ఉన్న శని దోష ప్రభావం తొలగిపోతుందని ప్రజలు నమ్ముతారు.కాకి శనీశ్వరుడి వాహనాలలో ఒకటి.నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా అందించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.

శనివారం రోజున వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swami )ని భక్తిశ్రద్ధలతో పూజించిన శనీశ్వరుడు శుభ ఫలితాలను ఇస్తాడని పండితులు చెబుతున్నారు.శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకును సమర్పించాలి.

ఇలా పూజించడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.అలాగే జాతకంలో శని దోషం ఉంటే శనీశ్వరుడి దేవాలయంలో నూనె, నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

అలాగే నల్లటి దుస్తులను సమర్పించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube