Atchannaidu :: బీజేపీతో పొత్తు కన్ఫామ్ చేసిన అచ్చెన్నాయుడు..!!

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( AP TDP Atchannaidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో టీడీపీ -జనసేన- బీజేపీ కలసి పోటీ చేస్తాయి అని పేర్కొన్నారు.

 Atchannaidu Confirmed Alliance With Bjp-TeluguStop.com

బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లారు.ప్రాథమిక చర్చలు ముగిశాయి.

దీంతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ( BJP ) కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి.ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై కాసేపట్లో బీజేపీ పెద్దలతో చంద్రబాబు( Chandrababu ) సమావేశం అవుతారు.

తరువాత సీట్ల విషయంపై ప్రకటన చేస్తారు అని అచ్చెన్నాయుడు మీడియాతో స్పష్టం చేయడం జరిగింది.

2014 ఎన్నికల సమయంలో ఈ రకంగానే పోటీ చేయడం జరిగింది. టీడీపీ…బీజేపీ… జనసేన కూటమి( TDP BJP Janasena Alliance )గా ఏర్పడి పోటీ చేసి అధికారంలోకి రావడం జరిగింది.2024 ఎన్నికలలో కూడా ఆ రకంగానే పోటీకి సిద్ధపడటంతో ఏపీలో లెక్కలు తారుమారవుతున్నాయి.బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు.గత నెల మొదటి వారంలో కూడా ఢిల్లీ పర్యటన చేపట్టి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం కావడం జరిగింది.

ఈసారి పవన్ కళ్యాణ్( Pawwan Kalyan )…చంద్రబాబు కలిసి ఢిల్లీ పర్యటన చేపట్టి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి పొత్తు కన్ఫామ్ చేసుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube