మహాశివరాత్రి జాతర( Mahashivaratri )లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు ఆదేశాలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ,క్యూ లైనలో ఉన్న భక్తులకు తో మాట్లాడుతూ వారికి ఇబ్బందులు ఉంటే సిబ్బందితో మాట్లాడుతూ సులభంగా దర్శనం అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
జాతరకు తరలివచ్చే వందలాది వాహనాల వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
శివరాత్రి జాతర సందర్భంగా దేవాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సుమారు 200 సీసీ కెమెరాలు( CC Cameras ) మరియు పట్టణ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తూ అవాంతరాలు జరిగిన ప్రదేశాలలో ,ట్రాఫిక్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి సెట్ కమ్యూనికేషన్ద్వారా సూచనలు చేస్తూ ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.