ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ -2 ( Veligonda second tunnel )ను ఆయన ప్రారంభించనున్నారు.
దోర్నాల మండలం ఎగువ చేర్లోపల్లికి వెళ్లనున్న సీఎం జగన్ ఫైలాన్ ను ఆవిష్కరించనున్నారు.అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించనున్నారు.
తరువాత టన్నెల్ -2 ను జాతికి అంకితం చేయనున్నారు.కాగా 18.8 కిలోమీటర్లు, 9 మీటర్ల వెడల్పుతో రెండు టన్నెల్ నిర్మాణం జరిగింది.
ఈ టన్నెల్స్ ద్వారా రోజుకి ఒక టీఎంసీ నీటిని తరలించనున్నారు.దీంతో నల్లమల సాగర్( Nallamalla sagar ) జలాశయానికి కృష్ణమ్మ జలాలు పరుగులు పెట్టనున్నాయి.అలాగే వరద సమయంలో రెండు టన్నెల్స్ ద్వారా 43.5 టీఎంసీల నీటిని తరలించనున్నారు.అలాగే ఈ టన్నెల్ ద్వారా ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీరు అందనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లా వాసుల వందేళ్ల కలను సీఎం జగన్ సాకారం చేశారు.కాగా సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
అనంతరం తాడేపల్లికి తిరుగుపయనం కానున్నారు.