జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.2024 లో కూడా కొన్ని సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు( Solar eclipses , lunar eclipses ) ఏర్పడనున్నాయి.మొదటి చంద్రగ్రహణం మాత్రం ఈ ఏడాదిలో మార్చి 25వ తేదీన ఏర్పడబోతుంది.ఇది పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకునే హోలీ పండుగ రోజు సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం ఉదయం 10 గంటల 23 నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది.ఇది భారతదేశం, జపాన్, అమెరికా, ఐర్లాండ్, రష్యా, ఇంగ్లాండ్, స్పెయిన్ వంటి ఇతర దేశాలలో కూడా కనిపిస్తుంది.
ఈ రాశుల వారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా శాలరీ హైక్ పొందవచ్చని చెబుతున్నారు.మరి ఆ రాశుల పై చంద్రగ్రహణం ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చంద్రగ్రహణం మేషరాశి ( Aries )వారిలో నాయకత్వ నైపుణ్యాలను పెంచుతుంది.పనిలో విజయం అందిస్తుంది.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు.కొత్త అవకాశాలను పొందవచ్చు.
ఈ సంవత్సరం ప్రమోషన్ కూడా అందుకుంటారు.
అలాగే కర్కటక రాశి( Cancer ) వారిలో ఆర్థిక అవకాశాలను పెంచుతుంది.ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది.కొత్త పెట్టుబడి అవకాశాలు కనిపిస్తాయి.
అలాగే కన్య రాశి( Virgo ) వారు పెద్ద విజయాన్ని సాధిస్తారు.ప్రేమ జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు.
వర్క్ ప్లేస్ లో కూడా విజయం సాధిస్తారు.అలాగే తుల రాశి వారు ఇతరులతో కలిసి పని చేస్తూ భాగస్వాములను ఏర్పరచుకోవడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందవచ్చు.
టీం వర్క్ సహకారం ద్వారా సొంత లక్ష్యాలను సాధించవచ్చు.
ఈ కాలంలో తోటి ఉద్యోగులు సహకరిస్తారు.అలాగే ఈ సమయంలో పెట్టుబడిలో రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది.కుంభ రాశి ( Aquarius ) వారు సోషల్ సర్కిల్ లో సక్సెస్ అవుతారు.
అలాగే మకర రాశి వారికి ఈ చంద్రగ్రహణం కెరీర్ లో స్థిరత్వం, భద్రతను అందిస్తుంది.అలాగే ఈ రాశి వారు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనం పొందుతారు.
DEVOTIONAL