CM Revanth Reddy : కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ తేడా చూపొద్దు..: సీఎం రేవంత్

ములుగు జిల్లాలో మేడారం మహాజాతర( Medaram Jatara )కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.ఈ క్రమంలో వనదేవతలను దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.

 Dont Differentiate Between North India And South India Cm Revanth-TeluguStop.com

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.అమ్మవార్లను దర్శించుకుని నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఏ ముఖ్యమైన కార్యక్రమం చేపట్టాలన్నా సమ్మక్క సారలమ్మ( Sammakka Saralamm )ల ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పారు.వనదేవతల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరు వేల బస్సులను మేడారం జాతరకు వినియోగించామని తెలిపారు.కోటి 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని చెప్పారు.కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ తేడా చూపొద్దన్నారు.అయోధ్యలో రాముడిని ఎలా దర్శించుకుంటున్నారో ప్రధాని, అమిత్ షా మేడారం వచ్చి అమ్మలను దర్శించుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube