జంట హత్యల కేసు విచారణలో భాగంగా కర్నూలు ఫ్యామిలీ కోర్టు ( Kurnool Family Court )సంచలన తీర్పును వెలువరించింది.జిల్లాలోని కల్లూరు మండలం ( Kallur Mandal )చెన్నమ్మ సర్కిల్ లో చోటు చేసుకున్న జంట హత్యల కేసులో ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష విధించింది.
అలాగే మరొకరికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.కాగా గతేడాది రుక్మిణి అనే యువతితో పాటు ఆమె తల్లిని నిందితులు హత్య చేసిన సంగతి తెలిసిందే.కుటుంబ కలహాల కారణంగా రుక్మిణితో పాటు ఆమె తల్లి రమాదేవి( Ramadevi )ని అల్లుడు శ్రవణ్ కుమార్, అతని తండ్రి కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.