కాంగ్రెస్( Congress ) గ్యారెంటీలు కాగితాలకే పరిమితమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ( BJP DK Aruna ) అన్నారు.ఆరు గ్యారెంటీల అమలు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) వస్తున్నాయని ఏదో చేస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో అసెంబ్లీలో చెప్పలేదన్నారు.
కానీ కొత్త ప్రాజెక్టుల గురించి ప్రపోజల్ చేస్తున్నారని విమర్శించారు.బీఆర్ఎస్( BRS ) అవినీతిపై బీజేపీ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు.
అలాగే ఉమ్మడి పాలమూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.