రైతు ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ నెల13వ తేదీన రైతు సంఘాలు చలో ఢిల్లీ ( chalo Delhi )కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.రైతులను అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా రోడ్లపై సిమెంట్ దిమ్మలు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.రైతు సంఘాల పిలుపుతో అప్రమత్తమైన హర్యానా ప్రభుత్వం( Haryana Govt ) మొత్త ఏడు జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది.
అయితే వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కేంద్రం రైతులకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఢిల్లీలో నిరనస కార్యక్రమం చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.ఈ క్రమంలో పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ట్రాక్టర్ ర్యాలీ( Farmers Tractor Rally ) నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాన రోడ్లపై పోలీసులు భారీగా మోహరించారు.