మరోసారి రైతు ఉద్యమం.. ఢిల్లీ -హర్యానా సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.!!

రైతు ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ నెల13వ తేదీన రైతు సంఘాలు చలో ఢిల్లీ ( Chalo Delhi )కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.రైతులను అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా రోడ్లపై సిమెంట్ దిమ్మలు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.రైతు సంఘాల పిలుపుతో అప్రమత్తమైన హర్యానా ప్రభుత్వం( Haryana Govt ) మొత్త ఏడు జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది.

అయితే వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కేంద్రం రైతులకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఢిల్లీలో నిరనస కార్యక్రమం చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

ఈ క్రమంలో పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ట్రాక్టర్ ర్యాలీ( Farmers Tractor Rally ) నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాన రోడ్లపై పోలీసులు భారీగా మోహరించారు.

చిరంజీవి విశ్వంభర సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ కొడుతాడా..?