రాజన్న సిరిసిల్ల జిల్లా: దశలవారీగా అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో నూతన పల్లె దవాఖానతో పాటు,సీసీ రోడ్లకు భూమి పూజ ను జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పల్లె దవాఖానాల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందని అన్నారు.ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉంటే దూర ప్రాంతాలకు వెళ్ళకుండా అందుబాటులోనే పల్లెల ద్వారా చికిత్స జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమను ఒకవైపు అభివృద్ధిని మరోవైపు కొనసాగిస్తుందని ఆన్నారు.అభివృద్ధి అనేది కొనసాగిస్తూ మన ప్రాంతాన్ని రంగంలో అగ్రగామిగా ఉండడానికి కృషి చేస్తానన్నారు.బ్రిడ్జి నిర్మాణాలతో పాటు రైతులకు ఉపయోగపడే వరి కల్లాలని త్వరలో నిర్మించుకుందామన్నారు.ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా చేస్తామన్నారు.
అందులో భాగంగా గెలిచిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి జరిగాయని గుర్తు చేశారు…మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచాలని రవాణా శాఖ మంత్రిని కోరగా 9 బస్సులను మంజూరు చేశారని అన్నారు.త్వరలోనే మిగతా హామీలను అమలు చేస్తామన్నారు.