క్రికెట్లో ఏ ఆటగాడు అయినా సెంచరీ చేస్తే ఇక ఆ ఆటగాడిపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తారు.మాజీ క్రికెట్ దిగజాలు సైతం ప్రశంసలతో ముంచెత్తుతారు.
అతని గురించి క్రికెట్ అభిమానులందరూ చర్చించుకోవడం మామూలే.ఒకవేళ అన్నదమ్ములు ఇద్దరు ఒకేరోజు సెంచరీ చేస్తే.
అది భారత క్రికెట్ లో ఒక హార్ట్ టాపిక్ గా మారుతుంది.ఇద్దరు అన్నదమ్ములు ఒకేరోజు సెంచరీలతో చెలరేగి భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించారు.
ఆ భారత జట్టు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
ప్రస్తుతం వెస్టిండీస్( West Indies ) వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్( Under 19 World Cup ) లో కొంతమంది భారత యువ ఆటగాళ్లు అద్భుత ఆటను ప్రదర్శిస్తుంటే.మరొకవైపు ఇంగ్లాండ్ లయన్స్ తో ఇండియా ఏ తరఫున ఆడుతున్న కొంతమంది ఆటగాళ్లు కూడా అద్భుత ఆట ప్రదర్శనతో అదరగొడుతున్నారు.అయితే ఇద్దరు అన్నదమ్ములు రెండు టీమ్స్ లో టీమిండియా కు ప్రాతినిధ్యం వహిస్తూ ఒకేరోజు సెంచరీ తో చెలరేగిపోయారు.
ఆ అన్నదమ్ములు ఎవరంటే.దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న సర్పరాజ్ ఖాన్( Sarparaj Khan ), ఇతని సోదరుడు ముషీర్ ఖాన్( Mushir Khan ).
ఇంగ్లాండ్ లయన్స్( England Lions ) తో ఇండియా ఏ జట్టు తరఫున సర్పరాజ్ ఖాన్ ఆడుతున్నాడు.ఇటీవలే జరిగిన మ్యాచ్లో 160 బంతుల్లో 161 పరుగులతో సర్పరాజ్ ఖాన్ అద్భుతంగా రాణించాడు.అండర్ 19 ప్రపంచ కప్ లో భాగంగా ఐర్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ 106 బంతుల్లో 111 పరుగులు చేశాడు.ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకేరోజు అద్భుతమైన సెంచరీలు చేసి ఓ అరుదైన రికార్డును సృష్టించారు.
ఈ ఖాన్ బ్రదర్స్ అద్భుతమైన సెంచరీలతో భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి.