ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా రెండు పార్టులు గా రాబోతుంది అయితే మొదటి పార్టు ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే నెలకొన్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.
అయితే రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కి మంచి ఆదరణ రావడంతో ట్రైలర్( Devara Trailer ) ని పకడ్బందీ గా ఒక ప్లాన్ ప్రకారం రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో అసక్తి ని రేకెత్తిస్తుంది.ఇక ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఒక డిఫరెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఎన్టీయార్ చేస్తున్న ఈ పాత్ర ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
అలాగే కొరటాల శివ ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆచార్య సినిమాతో బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మళ్ళీ తను పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అందులో భాగంగానే ఈ సినిమాని కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో కొరటాల( Koratala Siva ) ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…
.