పార్టీలో సంచలనాల దిశగా అడుగులు వేస్తున్నారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ).ముందుగా అభ్యర్థుల జాబితాను దశలవారీగా ప్రకటిస్తూ.
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలిచే విధంగా స్కెచ్ వేస్తున్నారు ఇప్పటికే నాలుగు విడతలుగా వైసిపి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు నాలుగో విడత జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు.ఇప్పటివరకు మొత్తంగా 10 ఎంపీ 58 మంది ఎమ్మెల్యే స్థానాలకు ఇన్చార్జిలను ఖరారు చేశారు.
ఇక ఐదో జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసినట్లు సమాచారం నిన్న విడుదల చేసిన నాలుగో జాబితాలో ఎస్సీ నియోజకవర్గాలైన సింగనమల ,నందికొట్కూరు, మడకశిర, తిరువూరు తో పాటు కనిగిరిలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు .అలాగే కొవ్వూరు, గోపాలపురం సిట్టింగ్ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.
చిత్తూరు ఎంపీ రెడ్డప్పను( MP Reddappanu ) గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇన్చార్జిగాను మార్చారు.నాలుగో జాబితాలో కనిగిరి మినహా మిగిలిన అన్ని ఎస్సీ రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి( Jonnalagadda Padmavati in Singanamala ) స్థానంలో వీరాంజనేయులు, కనిగిరి మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్, తిరువూరులో రక్షణ నిధి స్థానంలో స్వామి దాసు , గోపాలపురం, కొవ్వూరులలో ఉన్న ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు .గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు( MLA Thalari Venkatarao ) స్థానంలో ప్రస్తుత హోం మంత్రిగా ఉన్న తానేటి వనిత ను నియమించారు .కొవ్వూరు లో తలారి వెంకట్రావు ను నియమించారు.
మడకశిరిలో తిప్పేస్వామి స్థానంలో ఈరా లక్కప్ప, నందికొట్కూరులో ఆర్థర్ కు బదులుగా డాక్టర్ సుదీర్ దారాను ఇన్చార్జిగా నియమించారు.తొలి జాబితాలో 11మంది, రెండో జాబితాలో మూడు ఎంపీ, 24 ఎమ్మెల్యే , మూడో జాబితాలో ఆరు ఎంపీ 15 ఎమ్మెల్యే, నాలుగో జాబితాలో ఒక ఎంపీ 8 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం ఇప్పటివరకు 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్చార్జీలను మార్చారు .ఐదో జాబితానూ సిద్ధం చేసిన జగన్ త్వరలోనే దానిని కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.