హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద పోలీసులపై మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారంటూ మల్లు రవిని పోలీసులు అడ్డుకున్నారు.
సీఎం వస్తున్నారని గాంధీభవన్ లోకి ఎవరినీ పోలీసులు అనుమతించలేదు.దీంతో మల్లు రవి పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారని తెలుస్తోంది.అనంతరం పోలీసులు మల్లు రవిని లోపలికి అనుమతించారు.
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నేపథ్యంలో వచ్చానన్న ఆయన పార్టీ ముఖ్యనేతలను అనుమతించకపోవడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.