తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఈనెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు.
ఇప్పటికే రెండు హామీలు ప్రజల్లోకి వెళ్లాయన్న మంత్రి పొంగులేటి గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు.
నిండుకుండలాంటి రాష్ట్రాన్ని ఉట్టి కుండ చేశారని విమర్శించారు.రూ.6.71 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిన పెట్టారని మండిపడ్డారు.అయితే తమ ప్రభుత్వం పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ప్రజల గుమ్మం ముందుకే పథకాలు వస్తాయని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని వెల్లడించారు.