సైగలతోనే యజమానితో మాట్లాడుతున్న కుక్క.. ప్రపంచంలో ఇదే స్మార్టెస్ట్..?

కుక్కలు తమ యజమానులతో నాన్ వెర్బల్ పద్ధతుల్లో కమ్యూనికేట్ అవుతుంటాయి.బయటికి వెళ్లాలంటే తలుపు గీరడం, ఆకలవుతుంటే అరుస్తూ ముందు కూర్చోవడం, పడుకోవడానికి బెడ్ సరి చేయమని సైగలు చేయడం చేస్తుంటాయి.

 A Dog Talking To Its Owner With Gestures Is This The Smartest In The World, Vi-TeluguStop.com

మాటలు మాట్లాడకపోయినా చాలా వరకు ఇవి తమ భావాలను వ్యక్తపరచగలుగుతాయి.తమకు కావాల్సిన పనులు చేయించగలుగుతాయి.

అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక కుక్క తన యజమానిని వాకింగ్‌కి తీసుకెళ్ళమని అడగడానికి మనుషుల లాగానే సైగ చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ఈ వైరల్ క్లిప్ ఓపెన్ చేస్తే, ఒక గుమ్మం దగ్గర లేత గోధుమ రంగు కుక్క కూర్చొని ఉండటం గమనించవచ్చు.అది తలుపు పైన ఉన్న తాడు వైపుకు, అలాగే యజమాని వైపుకు కళ్ళను తిప్పుతూ ఉంది.ఈ సైగను బట్టి అది వాకింగ్ కి తీసుకెళ్లమని అడుగుతోందని ఈజీగా ఎవరికైనా అర్థమవుతుంది.యజమాని తన కుక్క ఇలా కమ్యూనికేట్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.దానిని వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియోలో కుక్క అంత ఎఫెక్టివ్ గా సైగలు చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ప్రపంచంలో స్మార్టెస్ట్ డాగ్ ఇదే అయ్యుంటుందని మరి కొందరు అంటున్నారు.

వామ్మో ఈ డాగ్ మామూల్ది కాదు, కళ్ళతోనే అన్ని మాట్లాడేస్తోందిగా అని మరికొందరు పేర్కొన్నారు.చాలామంది ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.తమ డాగ్స్ కూడా కళ్ళతో ఇలాంటి కొన్ని సైగలు చేస్తూ కమ్యూనికేట్ చేస్తాయని మరికొందరు పేర్కొన్నారు.

ఫుడ్( Food ) కావాలంటే పెంపుడు కుక్కలు కాలుతో స్నాక్ ప్యాకెట్ పై కొడతాయని ఇంకొందరు పేర్కొన్నారు.@B&S ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 7 లక్షల 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ హిలేరియస్ వీడియో క్లిప్ ను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube