జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ ను తెలంగాణ మంత్రులు సందర్శిస్తున్నారు.ఈ మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ప్రాజెక్టును పరిశీలించారు.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.తమకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలు లేవన్న ఆయన మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు.