స్మార్ట్ ఫోన్ ( Smart phone )లోకి వైరస్ ఎంటర్ అవ్వడం వల్ల ఫోన్ హ్యాకింగ్ కి గురి కావడం, ఫోన్ బ్యాటరీ( Phone battery ) తొందరగా అయిపోవడం, ఫోన్ త్వరగా రిపేర్ అవడం సమస్యలు తలెత్తుతాయి.అయితే స్మార్ట్ ఫోన్ లోకి వైరస్ ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకొని అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలకు పెట్టవచ్చు.
స్మార్ట్ ఫోన్లకు వచ్చే తెలిసి తెలియని లింక్స్ క్లిక్ చేస్తే.ఫోన్లో వైరస్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
స్మార్ట్ ఫోన్ లకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో వచ్చే తెలియని లింక్స్ పై ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయకూడదు.
ఆన్లైన్ వెబ్ సైట్ లలో భారీ డిస్కౌంట్ అంటూ కొన్ని నకిలీ వెబ్ సైట్లు( Fake websites ) ప్రచారంలో ఉన్నాయి.పొరపాటున ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే ఫోన్లోకి వైరస్ ప్రవేశిస్తుంది.గూగుల్ ప్లే స్టోర్( Google Play Store ) లో అందుబాటులో లేని ఏపీకే ఫైల్స్ రూపంలో ఉండే కొన్ని రకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్లోకి వైరస్లు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా యాప్ రివ్యూస్ ను ఒకసారి చెక్ చేసిన తర్వాతనే డౌన్లోడ్ చేసుకోవాలి.లేదంటే మీ ఫోన్లోని డేటా ఇతరుల చేతిలోకి వెళ్తుంది.
ఉచితంగా లభించే వైఫైల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.సైబర్ నేరగాళ్లు ఫ్రీ వైఫై ద్వారా ఫోన్లోకి వైరస్ లను పంపించి చాలా సులభంగా ఫోన్లు హ్యాక్ చేస్తారు.ఇక స్మార్ట్ ఫోన్ లోకి వైరస్ ఎంటర్ అయ్యింది అనే విషయం ఎలా తెలుసుకోవాలంటే.సడన్ గా ఫోన్ బ్యాటరీ చార్జింగ్ అయిపోవడం.ఫోన్లో అనుకోని యాడ్స్ పాప్ అప్ అవ్వడం, ఫోన్లో యాప్స్ వాటికవే డౌన్లోడ్ అవడం లాంటివి జరిగితే ఆ ఫోన్ లో వైరస్ ఉన్నట్టే.ఫోన్ హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే పైన చెప్పిన జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకోవాలి.