పెళ్లైంది కాబట్టి నా డబ్బులు నాకు రావాల్సిందే.. రెమ్యునరేషన్ పై నితిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ వక్కంతం వంశీ( Vakkantam Vamsi ) డైరెక్షన్ లో నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ( Extraordinary Man Movie ) రిలీజ్ కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అనే అభిప్రాయం కలుగుతోంది.

 Hero Nithin Shocking Comments Goes Viral In Social Media , Social Media, Hero N-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఈ సినిమాకు నితిన్ ( Nitin )కు పారితోషికం ఇచ్చారా? లేక సినిమా రిలీజ్ తర్వాత ఇస్తారా? అనే ప్రశ్న ఎదురుకాగా సినిమా రిలీజైన తర్వాత ఇస్తానని సుధాకర్ రెడ్డి సమాధానమిచ్చారు.ఆ తర్వాత నితిన్ స్పందిస్తూ ఇంతకుముందు నాకు పెళ్లి కాలేదు కాబట్టి డబ్బులు నా అకౌంట్ లోకి రాకపోయినా సమస్య లేదని ఇప్పుడు నాకు పెళ్లైంది కాబట్టి నా డబ్బులు నాకు రావాల్సిందేనని అన్నారు.నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని నేను కూడా ఎదగాలని నితిన్ అన్నారు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను నాకన్నా ఎక్కువగా వాడేది మీరేనని ప్రతి ఇంటర్వ్యూలో సైతం ఆయన గురించి ప్రశ్నలు అడిగేది మీరేనని నితిన్ వెల్లడించారు.మళ్లీ మీరే పవన్ అదీ ఇదీ అంటూ థంబ్ నెయిల్స్ పెడతారని నితిన్ పేర్కొన్నారు.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం నిజం అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులతో డీలా పడిన నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ఎక్స్ట్రా ఆర్డినరీ సక్సెస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.శ్రీలీల మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించడం లేదు.శ్రీలీల తర్వాత ప్రాజెక్ట్ లతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube