23 సంవత్సరాల వయస్సులోనే ఐఏఎస్ కలను నెరవేర్చుకోవాలంటే రేయింబవళ్లు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.శ్రీకాకుళం (Srikakulam), జిల్లాకు చెందిన వేదితారెడ్డి (Veditha Reddy)సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
సివిల్స్ ఫలితాలలో వేదితారెడ్డి ఏకంగా 71వ ర్యాంక్ సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.వేదితారెడ్డి తల్లి స్వస్థలం శ్రీకాకుళం కాగా తండ్రి స్వస్థలం విజయనగరం కావడం గమనార్హం.
ఢిల్లీలో చదువుకున్న వేదిత నోయిడాలో ఈసీఈలో బీటెక్(ECE in Engineering) పూర్తి చేశారు.ఐఏఎస్ కావడం గురించి వేదిత స్పందిస్తూ నాకు అమ్మానాన్నలే స్పూర్తి అని తెలిపారు.
నేరుగా ఐఏఎస్ దక్కడం ఎంతో ఆనందంగా ఉందని వేదిత చెప్పుకొచ్చారు.ఆంధ్రప్రదేశ్ (andhra pradesh)క్యాడర్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చానని వేదిత కామెంట్లు చేశారు.
రాష్ట్రంలో మా ప్రాంతం వెనుకబాటుకు గురైందని మహిళా సాధికారత లక్ష్యంగా పని చేయాల్సి ఉందని ఆమె కామెంట్లు చేశారు.
జిల్లాలో నలుమూలలా పర్యటించానని చాలా సమస్యలు నన్ను కదిలించాయని ఆమె చెప్పుకొచ్చారు.ఐఏఎస్ (IAS) కావడం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించాలని భావించానని వేదితా రెడ్డి వెల్లడించారు.ఐఏఎస్ కావడం ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆమె తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని సమస్యలు నన్ను ఎంతగానో కదిలించాయని వేదితా రెడ్డి అన్నారు.
రాత్రీపగలు ప్రణాళికాబద్ధంగా చదివానని వేదితా రెడ్డి కామెంట్లు చేశారు.సిలబస్, ఇంటర్వ్యూ, పరీక్షల విధానాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకుని ప్రణాళికతో ప్రిపేర్ అయితే సక్సెస్ కావడం సాధ్యమేనని ఆమె అన్నారు.నాన్న ఐ.ఎఫ్.ఎస్ అధికారి కావడంతో ఆ ప్రభావం నాపై పడిందని వేదితారెడ్డి వెల్లడించారు.వేదితారెడ్డి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.వేదితా రెడ్డికి కెరీర్ పరంగా సక్సెస్ సాధించే విషయంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉండటం ఆమెకు ప్లస్ అయింది.
వేదితారెడ్డి మరిన్ని సంచలనాలు సృష్టించాలని కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.