విజయశాంతి బీజేపీ ని వదలడానికి అసలు కారణం ఇదా..?

విజయశాంతి ( Vijayashanti ) సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది.అప్పట్లో హీరోలకు సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాల్లో రాణించింది.

 Is This The Real Reason Why Vijayashanthi Left Bjp , Ts Elections , Vijayasha-TeluguStop.com

ఇక ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనదైనా మార్క్ క్రియేట్ చేసింది.అయితే అలాంటి విజయశాంతి గత కొద్ది రోజులుగా బిజెపి పార్టీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే అనూహ్యంగా బిజెపి ( BJP ) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఎప్పటినుండో విజయశాంతి బీజేపీని వీడబోతుంది అని వార్తలు వినిపించినప్పటికీ నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు అంటూ మోడీ సభ లో స్పందించింది.

కానీ విజయశాంతి అలా చెప్పినప్పటికీ చాలామందికి ఈమెపై అనుమానం ఉండేది.ఎందుకంటే ఈమె కచ్చితంగా పార్టీని వీడుతుందని అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుందని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఈమెకు టికెట్ ఇవ్వలేదు అంటూ ప్రచారం జరిగింది.

అయితే అందరూ అనుకున్నట్లే బిజెపిని వదిలి కాంగ్రెస్ లోకి విజయశాంతి రాబోతుంది.ఇదిలా ఉంటే విజయశాంతి బీజేపీ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి రావడానికి ప్రధాన కారణం బిజెపి పార్టీ జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకోవడమే అని తెలుస్తుంది.

Telugu Chandrababu, Congress, Janasena, Kishan Reddy, Narendra Modi, Pawan Kalya

ఎందుకంటే విజయశాంతి కిషన్ రెడ్డి ( Kishan reddy ) కి రాసిన రాజీనామా లేఖలో ప్రాంతీయ పార్టీ వచ్చి పొత్తు పెట్టుకోవడం తనకి ఏమాత్రం నచ్చలేదు అన్నట్లుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.అంతేకాదు ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు.కానీ పార్టీలను మాత్రం ఆదరించరని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్ళనివ్వమని చెప్పుకొచ్చింది.

Telugu Chandrababu, Congress, Janasena, Kishan Reddy, Narendra Modi, Pawan Kalya

ఇక ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఎవరికైనా సరే తెలంగాణ ( Telangana ) లో చోటు ఉంటుంది.కానీ పార్టీలకు మాత్రం అస్సలు చోటు ఉండదని,అక్కడి ప్రజల కోసం ఏమైనా చేస్తాం కానీ పార్టీల కోసం కాదు అంటూ పరోక్షంగా జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోడాన్ని రాములమ్మ వ్యతిరేకించింది.అయితే అప్పట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సినీ ఇండస్ట్రీ నుండి ఎవరు స్పందించడం లేదనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ హీరోలను పరోక్షంగా విమర్శించిన విజయశాంతి ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి పొత్తు పెట్టుకున్న పార్టీలో ఎలా ఉంటుంది అని చాలామంది విజయశాంతి ని ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.

ఇక మరికొంత మందేమో జనసేనతో పొత్తు పెట్టుకుందని బిజెపి పార్టీని వదిలావు.కానీ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం పూర్తి అధికారం ఏపీ చేతుల్లోకి వెళ్తుందని, రేవంత్ రెడ్డి ( Revanth reddy ) గురువు చంద్రబాబు చేతుల్లోనే టీ కాంగ్రెస్ ఉంది అంటూ ఇలా ఎవరికి తోచిన రీతి లో వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube