సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలను చూస్తేనే ఆయన ఎంత పెద్ద హీరో అనేది మనకు అర్థం అవుతుంది.
ఇక వాళ్ల తండ్రి అయిన కృష్ణ గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సూపర్ స్టార్ గా ఎదుగుతున్న మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం( Guntur Karam ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా పైన చాలా రూమర్లు వస్తున్నాయి.ఎందుకంటే ఇప్పటికే సినిమాని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు.
అందులో భాగంగానే ఆయన మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి ఇక దానికి తోడుగా మహేష్ బాబు కూడా ఆయన మీద సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన సినిమా విషయంలో రోజురోజుకీ మరీ లేటు చేస్తున్నాడు అనే విషయంతో మహేష్ బాబు త్రివిక్రమ్( Director Trivikram ) మీద చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే త్రివిక్రమ్ ప్రతి సినిమా విషయంలో కూడా చాలా లేట్ చేస్తాడనే రూమర్ ని మరోసారి ప్రూవ్ చేశాడని చాలామంది విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈ గుంటూరు కారం 2024 సంక్రాంతి కనుకోగా వస్తుంది కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది మరి అది ఎప్పుడు పూర్తి చేసి ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహిస్తారనేది తెలియాలి…ఇక ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంది ఇది రిలీజ్ అయితే ఆ సినిమా మీదకి వెళ్లాలని చూస్తున్నాడు మహేష్… ఇక ఈ సినిమా తో వచ్చే పాన్ ఇండియా రేంజ్ ని వాడుకుంటూ పాన్ వరల్డ్ సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్దం అవుతున్నాడు….