బిగ్ బాస్ షోకు భోలే షావలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. 5 వారాలకు అంత సంపాదించారా?

బిగ్ బాస్ షో( Bigg Boss Show )కు సంబంధించి ఎపిసోడ్ ప్రసారం కాకముందే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనధికారికంగా తెలిసిపోతుంది.ఈ వారం భోలే షావళి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

 Do You Know How Much Remuneration Bhole Shavali Took For 5 Weeks For Bigg Boss-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న భోలే షావలి ఈ షో కోసం భారీ స్థాయిలోనే పారితోషికం అందుకున్నారని సమాచారం అందుతోంది.భోలే షావళి( Bhole Shavali ) మరికొన్ని వారాలు ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేశారు.

యావర్, రతికా రోజ్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండేదని బిగ్ బాస్ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bhole Shavali, Bigg Boss Show, Wild-Movie

పాటబిడ్డగా పేరు తెచ్చుకున్న భోలే షావళి వారానికి 2.50 లక్షల రూపాయల చొప్పున పారితోషికం( Bhole Shavali Bigg Boss Remuneration ) అందుకున్నారని సమాచారం అందుతోంది.రోజుకు 35,000 రూపాయల చొప్పున ఆయన సంపాదించారని చెప్పవచ్చు.

భోలే షావళి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.బిగ్ బాస్ షో భోలే షావళి కెరీర్ కు ఒకింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని భోలే షావళి ఈ షో తర్వాత ఎలాంటి ఆఫర్లను అందుకుంటారో చూడాలి.మరోవైపు కంటెస్టెంట్ల సంఖ్య తగ్గడం వల్ల ఈ షో బోర్ కొడుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bhole Shavali, Bigg Boss Show, Wild-Movie

ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందేలా బిగ్ బాస్ షో నిర్వాహకులు మరిన్ని జాగ్రతలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భోలే షావలి ఎలిమినేషన్ ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపడుతోంది.ఐదు వారాలకు భోలే షావలికి 12.50 లక్షల రూపాయల పారితోషికం దక్కడం గమనార్హం.వైల్డ్ కార్డ్ ఎంట్రీ( Wild Card Entry ) ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన భోలే షావలి జెన్యూన్ గా గేమ్ ఆడారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube