తెలంగాణలోని వైఎస్ఆర్ టీపీ నుంచి వైఎస్ షర్మిలను బహిష్కరిస్తున్నామని ఆ పార్టీ ముఖ్యనేత గట్టు రామచంద్రరావు అన్నారు.ఇకపై వైఎస్ఆర్ టీపీకి షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో షర్మిల ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వైఎస్ఆర్ టీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.ఈ క్రమంలోనే నేతలంతా మూకుమ్మడి రాజీనామాకు సిద్ధం అయ్యారు.
హైదరాబాద్ లో పార్టీ ముఖ్యనేత గట్టు రామచంద్రరావుతో పాటు ఇతర నాయకులు సమావేశం అయ్యారు.పార్టీ నేతలతో చర్చించకుండా పోటీ అంశంపై షర్మిల ఎలా నిర్ణయం తీసుకుంటారని మండిపడుతున్నారు.
ఇకపై పార్టీకి షర్మిలమ్మకు ఎటువంటి సంబంధం లేదని, పార్టీ తమదని తేల్చిచెప్పారు.ఈ క్రమంలోనే షర్మిలమ్మను బహిష్కరిస్తున్నామన్న గట్టు రామచంద్రరావు భవిష్యత్ కార్యాచరణను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.