ముఖ్యంగా చెప్పాలంటే జంక్ ఫుడ్ ( Junk food )ను ఎక్కువగా తీసుకోవడం, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం, ఇంకా వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో( heart problems ) బాధపడుతూ ఉన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు.
కొందరు గుండె సమస్యల కారణంగా తమ ప్రాణాలను కూడా కోల్పోతూ ఉన్నారు.అయితే శరీర ఆరోగ్యం చక్కగా ఉండాలన్న, ఇంకా గుండె సమస్యలు మన దరిచేరకుండా ఉండాలన్న మన ఆహారపు అలవాట్లలో కచ్చితంగా ఈ మార్పులు చేసుకోవాలి.
ఇంకా చెప్పాలంటే గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా జంక్ ఫుడ్ కు, తీపి పదార్థాలకు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
కొవ్వు కలిగిన పదార్థాలకు బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అయితే చాలా మంది ప్రోటీన్ అనేది మాంసాహారంలో ఎక్కువగా ఉంటుందని భావిస్తారు.కానీ మాంసాహారన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.
తరచూ మాంసాహారాన్ని తినడం వల్ల గుండె సమస్యలు పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.కాబట్టి మాంసాహారానికి బదులుగా ప్రోటీన్( Protein ) ఎక్కువగా ఉండే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవాలి.
పల్లీలు, ఇంకా సొయా చిక్కుళ్ళు( pulses, soya beans ) వంటి ఆహారాల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.ఈ ఆహారాలను తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఇంకా శరీరంలో కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి.అలాగే కొలెస్ట్రాల్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్( Cholesterol ) ను తగ్గించుకోవడానికి చాలా మంది అన్నాన్ని తీసుకోవడం మానేస్తున్నారు.అయితే అన్నానికి బదులుగా అంతే శక్తిని ఇచ్చే ఇతర ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
ఈ విధంగా అన్నానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.ఇంకా కొలెస్ట్రాల్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది.
అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.