నేరేడు పంట సాగులో ఎరువుల యాజమాన్యం.. సస్యరక్షక పద్ధతులు..!

వ్యవసాయం( Agriculture ) చేసే రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను సాగు చేస్తేనే వ్యవసాయంలో మంచి లాభాలు పొందవచ్చు.కొందరు రైతులు ఎన్నో ఔషధ గుణాలు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న అల్ల నేరేడు పండ్ల సాగు ( Jamun Cultivation )చేస్తున్నారు.

 Ownership Of Fertilizers In Cultivation Of Neredu Crop.. Plant Protection Method-TeluguStop.com

ఈ నేరేడు పండు సీజనల్ ఫ్రూట్.కాబట్టి మార్కెట్లో ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది.

తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలి అనుకునే రైతులంతా ఈ పంట సాగుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

-Latest News - Telugu

నేరేడు పండ్ల సాగుకు అన్ని రకాల నేలలు దాదాపుగా అనుకూలంగానే ఉంటాయి.వాతావరణ పరిస్థితులు కూడా ఈ పంట సాగుకు అనుకూలం అనే చెప్పాలి.ఇంకా వ్యవసాయానికి పనికిరాని ఉప్పు లేదా చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు.

ఈ నేరడు పండ్ల సాగులో భారతదేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో కొనసాగుతోంది.ఎలాంటి కరువు పరిస్థితులను సైతం తట్టుకొని జీవించే శక్తి ఈ నేరేడు మొక్కలకు ఉంది.

పైగా ఈ పంటకు చీడపీడల ( Pests )బెడద చాలా తక్కువ.కేవలం పూత, పిందె, కాయ ఏర్పడే దశలలో పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటు సరైన సస్యరక్షక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.

-Latest News - Telugu

నేరేడు పంట సాగులో పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే.జూన్ లేదా జూలై నెలలో తగిన పరిమాణంలో ఎరువులు అందించాలి.ప్రతి చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు, 1.5 కిలోల సూపర్ ఫాస్ఫేట్,( phosphate, ) ఒక కిలో యూరియా, 500గ్రా.పొటాష్ ఎరువులు వేయాలి.ఇక నేలలోని తేమశాతాన్ని బట్టి పంటకు నీటి తడులు అందించాలి.

పంట పిందే దశలో ఉన్నప్పుడు ఒక లీటరు నీటిలో 10 గ్రాముల యూరియా, ఫార్ములా-4 ను 3గ్రా.ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే నేరేడు పండు సైజు అధికంగా ఉండి నాణ్యమైన పంట పొందవచ్చు.

కొత తర్వాత పంటను వెంటనే మార్కెట్ చేస్తే మంచి ధర పలుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube