ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( Cricket World Cup ) టోర్నీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.పెద్ద పెద్ద టీమ్స్ చిన్న టీమ్స్ చేతుల్లో ఓడిపోతున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ రంగంలో ఎప్పటినుంచో రాణిస్తున్న జట్లు సైతం ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి.వెస్టిండీస్ లాంటి టీం వరల్డ్ కప్ టోర్నీకి క్వాలిఫై కాని పరిస్థితి ప్రారంభంలో నెలకొంటే ఇప్పుడు.
పెద్ద పెద్ద జట్లు సైతం టోర్నీ నుండి తప్పుకునే పరిస్థితి నెలకొంది.ఇదే సమయంలో ఊహించని విధంగా మొట్టమొదటిసారి ప్రపంచ కప్ ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) అద్భుతమైన ప్రదర్శనతో పెద్ద పెద్ద జట్లను ఓడిస్తూ ఉంది.
తాజాగా శుక్రవారం నెదర్లాండ్స్ తో ( Netherlands ) జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించింది.అంతేకాదు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ కి( Pakistan ) షాక్ ఇచ్చే రీతిలో.దూసుకుపోయింది.ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ నీ వెనక్కి నెట్టి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను ఆఫ్ఘనిస్తాన్ సమం చేసింది.కాగా ఇది ఆఫ్గాన్ కి వరుసగా మూడో విజయం.ఇంతకుముందు ఇంగ్లాండ్, పాకిస్తాన్ లపై గెలవడం జరిగింది.
నెదర్లాండ్స్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో పాకిస్తాన్ కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.నెదర్లాండ్స్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ ఏడూ వికెట్ల తేడాతో విజయం సాధించింది.నెదర్లాండ్స్ ఇచ్చిన 180 పరుగుల టార్గెట్ ను ఆఫ్ఘనిస్తాన్ 31.3 ఓవర్ లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.