ఇళ్లలో చాలా మంది తినే ఆహారంపై ( Food )మూతలు పెట్టడం మర్చిపోతుంటారు.అయితే ఖచ్చితంగా మూతలు పెట్టాలి.
లేకుంటే అందులో ఈగలు, దోమలు, ఇతర కీటకాలు పడే అవకాశం ఉంటుంది.అందు వల్ల వాటికి మూతలు పెట్టకుంటే మనం తినే ఆహారం విషపూరితంగా మారే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా బల్లులు, బొద్దింకలు మనం తినే ఆహారంలో పడే అవకాశం ఉంది.వాటిని తింటే ఆసుపత్రి పాలవ్వాల్సి ఉంటుంది.
ఇటువంటివి మనం తరచూ మీడియాలో చూస్తుంటాం.ఆహారంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజన్ అయిందనే వార్తలు విన్నప్పుడు కొంచెం బాధ పడతాం.
మనకు అటువంటి ఘటనలు ఎదురు కాకుండా ఉండాలంటే మనం కూడా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం అవసరం.అయితే ఇదే కోవలో ఓ ఇంట్లో టీ( Tea ) తాగిన తర్వాత ఆ పాత్రను అలాగే వదిలేశారు.
దానిపై బల్లి ( Lizard )పడింది.దానిని నాకుతూ కనిపించింది.ఈ వీడియో సోషల్ మీడియాలో ( Social media )వైరల్ అవుతోంది.‘
చాలా మందికి టీ తాగడం అంటే చాలా ఇష్టం.కొంత మంది రోజులో 5 సార్లకు మించి టీ తాగుతుంటారు. టీ తాగకపోతే తలపోటు వస్తుందని చాలా మంది అనడం మనం వింటుంటాం.
ఇక డ్యూటీలు చేసే వారు అయితే తలపోటు వస్తుందంటూ టీ తాగడానికి, దమ్ము కొట్టడానికి బయటకు వస్తుంటారు.
ఏదేమైనా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ( viral video )చూస్తే ఆహారం, వంటల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలనే విషయం అర్ధం అవుతుంది.ముఖ్యంగా తినే ఆహారం, టీ వంటి పాత్రలపై ఖచ్చితంగా మూతలు పెట్టాలి.మూత లేకపోవడం వల్ల టీ వడగట్టే జాలీపై ఓ బల్లి పడింది.
దానిని నాకుతూ కనిపించింది.బల్లి విషపూరితమైనది.
అది పడిన ఆహారం తింటే అస్వస్థతకు గురవుతాం.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగానే నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
అందరూ ఆహారం( Food ), వంట పాత్రలపై ఖచ్చితంగా మూతలు పెట్టాలని సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు.