నియంతలు, ఉగ్రవాద సంస్థలపై ప్రశంసలు.. ట్రంప్‌ను ఏకీపారేసిన భారత సంతతి నేత నిక్కీ హేలీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ( Nikki Haley ) తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధుల రేసులో ఆమె ట్రంప్, డిసాంటిస్, వివేక్ రామస్వామి తర్వాత నిలిచారు.

 Indian Origin Nikki Haley Criticises Trump Praise For Dictators And Terrorist Gr-TeluguStop.com

ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) నిక్కీ విరుచుకుపడ్డారు.‘‘ Republican Jewish Coalition’’ వార్షిక సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.

గతంలో నియంతలు, ఉగ్రవాద సంస్థలను ప్రశంసించినందుకు గాను ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.అక్టోబర్ 7న హమాస్ ( Hamas ) ఊచకోతకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ( Benjamin Netanyahu ) వ్యవహరించిన తీరుపై ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సైతం నిక్కీ హేలీ కౌంటరిచ్చారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల బైడెన్‌ను అభినందించడం ద్వారా నెతన్యాహూ నమ్మకద్రోహం చేశాడని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Telugu Dictators, Donald Trump, Hamas, Hezbollah, Kim Jong, Nikki Haley, Terrori

ఇరాన్ మద్ధతుతున్న లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాపై ట్రంప్ గతంలో చేసిన ప్రశంసలను సైతం నిక్కీ హేలీ ప్రస్తావించారు.ఈ సంస్థను అమెరికా ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.అలాంటి హిజ్బుల్లాను ట్రంప్ చాలా తెలివైనదిగా ప్రశంసించారు.

తాను అధ్యక్షుడినైతే హిజ్బుల్లాను( Hezbollah ) అభినందించను, విషాదంలో, యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ ప్రధానిని విమర్శించను అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్,( Xi Jinping ) ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ల( Kim Jong Un ) పట్ల ట్రంప్ స్నేహపూరిత వైఖరిని కూడా ఆమె ఖండించింది.

వాళ్లు మంచివాళ్లో, తెలివైన వ్యక్తులో కాదని .మనం నైతికంగా గందరగోళంగా వుండాలని వారు కోరుకుంటున్నారని నిక్కీ తెలిపారు.

Telugu Dictators, Donald Trump, Hamas, Hezbollah, Kim Jong, Nikki Haley, Terrori

అబ్రహం ఒప్పందాలు వంటి ఇజ్రాయెల్‌కు సంబంధించి ట్రంప్ సాధించిన విజయాలను అంగీకరిస్తూనే, భవిష్యత్తులో ట్రంప్ ఏం చేస్తారని హేలీ ప్రశ్నించారు.ప్రస్తుతం మన జీవితకాలంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో వున్నామని ఆమె వ్యాఖ్యానించారు.అయితే హమాస్‌పై పోరాటంలో ఇజ్రాయెల్‌కు హేలీ మద్ధతు ప్రకటించారు.ఉగ్రవాదుల చేతుల్లో కనీసం 33 మంది అమెరికన్లు హతమైనందున .హమాస్‌ను నిర్మూలించడానికి అవసరమైన ప్రతి దానిని ఇజ్రాయెల్‌కు అమెరికా అందించాలని ఆమె కోరారు.2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిలిచిన ట్రంప్‌కు 59.1 శాతం మంది మద్ధతు వుండగా.నిక్కీ హేలీ ప్రస్తుతం 8.3 శాతం మద్ధతుతో మూడవ స్థానంలో నిలిచినట్లు ‘‘ RealClearPolitics ’’ సర్వే తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube