తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాల రగులుతోంది.ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి నాయకురాలు సరస్వతి భంగపడ్డారు.
ఈ క్రమంలోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవికి మర్సుకోల సరస్వతి రాజీనామా చేశారు.ఆదివాసులతో సమావేశం అయిన సరస్వతి కన్నీంటి పర్యంతం అయ్యారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని శ్యామ్ నాయక్ కు టికెట్ ఇచ్చారని సరస్వతి ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తానన్న ఆమె శ్యామ్ నాయక్ ఓటమే లక్ష్యంగా ప్రచారం చేస్తానని తెలిపారు.పారాచ్యూట్ లీడర్లకు టికెట్ ఇవ్వడం తప్పన్న ఆమె మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఆరోపించారు.
అధిష్టానం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.