ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇరుక్కొని ఇన్ని రోజులైనా కూడా బయటికి రావడం లేదు.ఇక ఈయనకు కోర్టులో చాలావరకు ఎదురుపవనాలు వీస్తున్నాయి.
బెయిల్ కూడా దొరకడం లేదు.అయితే చంద్రబాబు వచ్చే ఎన్నికల వరకు అయినా జైలు నుండి బయటకు రావాలని టిడిపి ( TDP ) నేతలు కోరుకుంటున్నారు.
అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గురించి ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే చంద్రబాబు నాయుడు తనకి ఆంధ్రప్రదేశ్లో అధికారం రాకపోయినా పర్వాలేదు కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలి అని అనుకుంటున్నారట.
అయితే చంద్రబాబు ఇలా ఎందుకు అనుకుంటారని ప్రతి ఒక్కరు భావించవచ్చు.ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటుగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఉన్నారు.ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా కూడా మొత్తం చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని బాబు నమ్మకం.అలాగే తనని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే కేసులో ఇరికించి జైల్లో కూర్చోబెట్టారో అలాగే జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )ని కూడా కేసుల్లో ఇరికించి వైసిపి ప్రభుత్వాన్ని కూల్చడానికి రేవంత్ రెడ్డి తనకు ఎంతగానో ఉపయోగపడతాడు అని భావిస్తున్నాడట.
అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తనకు అంతో ఇంతో తెలంగాణ లో కాంగ్రెస్ గెలిస్తే అక్కడినుండి అన్ని రకాల వనరులు చంద్రబాబుకి అందుతాయని భావిస్తున్నారట.ఇక బీఆర్ఎస్ ( BRS) పార్టీకి వైసిపి పార్టీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే చంద్రబాబుకి అనుకూలం.లేకపోతే తాను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని భావిస్తున్నారట.ఇక కేసుల్లో ఇరికించి ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి సహాయంతో జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ని ఇరకాటంలో పడేయాలి అని, ఇది జరగాలంటే రేవంత్ రెడ్డి సహాయం తనకు ఎంతగానో అవసరం అని, అది కేవలం రేవంత్ రెడ్డి సీఎం అవుతేనే తనకి కలిసి వస్తుంది అని చంద్రబాబు నాయుడు జైల్లో తపస్సు చేస్తున్నారు అంటూ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక కేంద్రంలో కూడా కాంగ్రెస్ ( Congress )వస్తే తాను అనుకున్న పని మరింత వేగంగా అయిపోతుందని,జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట.
ఇక ఈ పని చేయాలంటే చంద్రబాబునాయుడు ఒక్కడు కాకుండా రేవంత్ రెడ్డి సహాయం ఉంటే అది మరింత సులభతరం అవుతుంది అని బాబు ఆలోచనలో పడ్డట్టు సమాచారం.