అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో( New Jersey ) మేయర్‌గా వున్న భారత సంతతి వ్యక్తి రవి భల్లా,( Mayor Ravi Bhalla ) అతని ఫ్యామిలీని చంపేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.పదవికి రాజీనామా చేయాలనే లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయనకు బెదిరింపు మెయిల్ వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి.
నవంబర్ 2017లో హోబోకెన్ సిటీకి మేయర్‌గా ఎన్నికైన తొలి సిక్కు వ్యక్తిగా రవి భల్లా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన స్థానిక సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ .ఏడాది క్రితం నుంచి తనకు బెదిరింపులు మొదలైనట్లు చెప్పారు.పదవికి రాజీనామా చేయాలని లేనిపక్షంలో చంపేస్తామని అందులో గుర్తుతెలియని దుండగులు హెచ్చరించారు.
అలా ఇప్పటి వరకు మూడు లేఖలు పంపారని.చివరిసారి పంపిన లేఖలో తాను రాజీనామా చేయకుంటే తనను, తన భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరించారని రవి తెలిపారు.
తనపైనా, తన కుటుంబంపైనా వారికి కోపం, ద్వేషం వున్నట్లుగా తెలుస్తోందన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో 15, 11 సంవత్సరాల వయసున్న అతని పిల్లలతో పాటు రవి భల్లాకు పోలీసులు 24 గంటల పాటు భద్రతను అందిస్తున్నారు.తనతో పాటు తన పొరుగువారు, తన సోదరుడు , ఇతర సహచరులు కూడా బెదిరింపులను ఎదుర్కొంటున్నారని రవి భల్లా తెలిపారు.వీటికి బాధ్యులైన వ్యక్తిని పట్టుకుని అభియోగాలు మోపామని.
అయితే బెదిరింపు లేఖల( Threatening Letters ) వెనుక వున్న వ్యక్తి ఇప్పటికీ పరారీలో వున్నాడని భల్లా చెప్పారు.నగరంలో ఎలాంటి ద్వేషానికి తావులేదని.ఇలాంటి వాటికి వ్యతిరేకంగా తాను బలంగా నిలబడతానని రవి స్పష్టం చేశారు.సిక్కులు( Sikhs ) పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఈ నగరాన్ని నడిపించడం తనకు గర్వంగా వుందని ఆయన పేర్కొన్నారు.
9/11 దాడుల తర్వాత సిక్కు అమెరికన్లు ఎదుర్కొన్న ఎదురుదెబ్బల గురించి తెలుసుకున్న భల్లా.అమెరికాలో( America ) ఇప్పటికే తీవ్రవాదం వుందన్నారు.విద్య, ప్రేమ ద్వారా ద్వేషాన్ని మనం అంతం చేయవచ్చని రవిభల్లా అభిప్రాయపడ్డారు.గత వారం న్యూయార్క్ నగరంలోని( Newyork ) ఒక బస్సులో 19 ఏళ్ల సిక్కు యువకుడిపై విద్వేషదాడి జరిగింది.అతనిని కొట్టడంతో పాటు తలపాగాను లాగేందుకు ప్రయత్నించిన ఘటనపైనా భల్లా స్పందించారు.26 సంవత్సరాల వయసులో హోబోకెన్ నగరానికి ఆయన వచ్చారు.లా విద్యాభ్యాసం తర్వాత నెవార్క్‌లోని ఒక చిన్న న్యాయ సంస్థలో వృత్తి జీవితాన్ని ప్రారంభించి.అమెరికాలో ప్రముఖ పౌర హక్కుల న్యాయవాదిగా రవి భల్లా గుర్తింపు తెచ్చుకున్నారు.
మేయర్ కావడానికి ముందు హోబోకెన్ సిటీ కౌన్సిల్‌లో( Hoboken City Council ) ఎనిమిదేళ్లు పనిచేశాడు.
కాగా.
సోమవారం విడుదల చేసిన ఎఫ్‌బీఐ డేటా ప్రకారం 2022లో 198 సిక్కు వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.దీనిని బట్టి అమెరికాలో ద్వేషపూరిత నేరాలను ఎదుర్కొంటున్న రెండవ సమూహగా సిక్కులు నిలిచారు.