యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ( Karti ) ఒకరు.ఈయన కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్( Tollywood ) లో కూడా బాగా ఫేమస్ అనే చెప్పాలి.
ఎందుకంటే కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేయడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.అందుకే కార్తీ చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ సాధిస్తాయి.
ఇక ఈ కార్తీ ఈ మధ్యనే పొన్నియన్ సెల్వన్ 1, 2( Ponnian Selvan 1, 2 ) లలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.మధ్యలో సర్దార్ సినిమాతో కూడా అలరించిన కార్తీ ప్రజెంట్ యంగ్ డైరెక్టర్ రాజు మురుగన్ ( Young director Raju Murugan )తో జపాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టీజర్ రాబోతున్నట్టు కాసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి కార్తీ పుట్టినరోజు నాడు అదిరిపోయే ఇంట్రో రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు.మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.డిఫరెంట్ గా యూనిక్ గా కార్తీ లుక్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది.ఇక ఈ సినిమాకు డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
మరి జపాన్ సినిమాతో కార్తీ ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.ఈ రోజు టీజర్ తోనే ఏ మాత్రం ఆకట్టుకుంటుందో తెలిసిపోనుంది.
మరికొన్ని గంటల్లో రానున్న టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.